గోపాల్ పెట్ లో 10 లక్షలతో విఓ భావన నిర్మాణానికి శంకుస్థాపన
నిర్మల్ సాక్షర: సారంగాపూర్ మండలం గోపాల్ పేట్ గ్రామంలో 10 లక్షలతో SHG (V.O) విఓ భవన నిర్మాణం షెడ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.అనంతరం శివాజీ జయంతి సందర్భంగా గ్రామంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, గ్రామ సర్పంచ్ గంగారెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల నాయకులు రాజేందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

