📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
International News

ఇరాన్ విమానాలు ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేత : అమెరికా

◉ RATHIKANTI NAVEEN   |   ◷ Latest
 ఇరాన్ విమానాలు ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేత : అమెరికా
AdvertisementAdvertisement
గత కొన్ని నెలలుగా ఇరాన్‌‍తో కొనసాగిస్తున్న యుద్ధాన్ని అమెరికా మరో స్థాయికి తీసుకెళ్లింది. బుధవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థల సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇరాన్ విమానాలకు ఏ దేశంలోనైనా, ఏ సంస్థ అయినా సాయం అందిస్తే, వారిని యూఎస్ డాలర్ ఆర్థిక వ్యవస్థ నుంచి వెలివేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరింత ఒంటరి చేసే కీలక చర్యగా భావిస్తున్నారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సెప్టెంబరు 21న సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 'సెప్టెంబర్ 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇరానియన్ ఎయిర్ లైన్స్'ను మూసివేస్తాం' అని ఆయన స్పష్టం చేశారు. ఇది ప్రత్యక్ష నిషేధం కానప్పటికీ, 'సెకండరీ ఆంక్షల' రూపంలో అమలు చేయనున్నారు. దీని ప్రకారం, ఇరాన్ విమానాలకు ఇంధనం నింపినా, ల్యాండింగ్ సేవలు అందించినా, టికెట్లు విక్రయించినా, ఆయా ఎయిర్ పోర్టులు, సంస్థలు డాలర్ లావాదేవీలకు అనర్హులుగా మారతాయి.అమెరికా - ఇరాన్ మధ్య ఫిబ్రవరి 2026 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఆగస్టు 24న ప్రకటించిన 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన విమానయాన సంస్థలను ఆయుధాలు, సైనికులు, అక్రమ సామగ్రి రవాణాకు ఉపయోగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న 27 ఇరాన్ విమానయాన సంస్థలను ఆంక్షల జాబితాలో చేర్చింది.ఈ కొత్త ఆంక్షల బెదిరింపులతో ఇరాన్ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలోపడనుంది. ఇప్పటికే విడిభాగాలు, నిర్వహణ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఇరాన్ విమానాలకు అంతర్జాతీయ సేవలు దాదాపు అసాధ్యంగా మారనున్నాయి. ఇప్పటికే మహాన్ఎయిర్ టర్కీకి సర్వీసులు నిలిపివేయగా, ఇరాక్, జార్జియా వంటి దేశాలు కూడా ఇరాన్ విమానాలను నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇరాన్ ఆంక్షల విషయంలో చైనాతో కూడా చర్చిస్తున్నామని, ఈ అంశంపై చైనా 'చాలా ఎంగేజ్‌గా' ఉందని బెసెంట్ తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ కఠిన ఆంక్షలు అమల్లోకి రానుండగా, ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రతిస్పందన వస్తుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.