‘సూపర్ టాలెంటెడ్ కిడ్’ అవార్డులు పొందిన బాలుడికి కలెక్టర్ అభినందనలు
నిర్మల్ సాక్షర :జిల్లాకు చెందిన సౌజన్య, రాకేశ్ దంపతుల కుమారుడు కేవలం 19 నెలల వయసులోనే 50 మీటర్ల దూరాన్ని 36 సెకన్లలో పూర్తి చేసి అరుదైన ప్రతిభను చాటుకున్నాడు.ఈ అసాధారణ ప్రతిభకు గాను బాలుడు నోబుల్ వరల్డ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల నుండి సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డులు అందుకున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తన ఛాంబర్‌లో బాలుడిని,అతని తల్లిదండ్రులను అభినందించారు.శాలువాతో సన్మానించి, మెడల్స్, సర్టిఫికెట్లు సాధించడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా బాలుడిని ప్రోత్సహించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తన ఛాంబర్‌లో బాలుడికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

