- ఫండ్ రైజింగ్ ద్వారా ఐదు లక్షలకు పైగా ఆర్థిక సహాయం
- ఆపదలో ఉన్న కుటుంబానికి చెక్కు అందజేత
ఖమ్మం సాక్షర: వైరా నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ గారి మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష గుండె సంబంధిత వ్యాధితో కూకట్‌పల్లి అంకురా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిన వెంటనే జనసేన కార్యకర్తలు ముందుకు వచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స కొనసాగించలేని పరిస్థితి ఏర్పడటంతో సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు. ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా ఐదు లక్షల ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయల మొత్తాన్ని సమీకరించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చేతుల మీదుగా ఆ చెక్కును రామకృష్ణ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జనసైనికులు అడబల షణ్ముఖ, ధనపాల సందీప్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విరాళాలు అందించి చిన్నారి చికిత్సకు తోడ్పడిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడాలని, కుటుంబానికి ఈ సహాయం కొంత ఉపశమనం కలిగించాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన జనసైనికుల చర్యను పలువురు అభినందించారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement