📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
Business & Economy

రూ.లక్షకు రూ.45 వేల లాభం… పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
రూ.లక్షకు రూ.45 వేల లాభం… పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్
AdvertisementAdvertisement
హైదరాబాద్: బ్యాంకులకు దీటుగా.. ప్రభుత్వ భరోసాతో పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది. కేవలం ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఐదేళ్లలో దాదాపు రూ.45 వేల లాభాన్ని పొందవచ్చు. చక్రవడ్డీ మ్యాజిక్‌తో పెట్టుబడిని సురక్షితంగా పెంచే ఈ పథకం ముఖ్యంగా సామాన్యులను ఆకర్షిస్తోంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహాలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ హామీతో పెట్టుబడికి 100 శాతం భద్రత ఉంది. ఖాతాను కనీసం రూ.1,000తో ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి లేదు. వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి: 1 సంవత్సరం 6.9%, 2 ఏళ్లు 7.0%, 3 ఏళ్లు 7.1%, 5 ఏళ్లు 7.5%. చాలాబ్యాంకులు 5 ఏళ్ల FDపై 6.5%–7% మాత్రమే ఇస్తున్న సమయంలో, పోస్ట్ ఆఫీస్ 7.5% వడ్డీ అందిస్తోంది. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించి అసలు పెట్టుబడికి కలిపి మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. దీని వల్ల సాధారణ వడ్డీ కంటే ఎక్కువ లాభం వస్తుంది. వడ్డీని వార్షికంగా సేవింగ్స్ అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ వద్ద ఒకేసారి పొందవచ్చు. ఒక లక్ష రూపాయలను ఐదేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేస్తే వడ్డీ ఆదాయం రూ.44,995 వస్తుంది. మొత్తం పొందే మొత్తం రూ.1,44,995, అంటే సగం డబ్బు వడ్డీ రూపంలోనే అదనంగా లభిస్తుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌కు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు, యువత, అందరికీ ఒకే రకమైన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. సమీపంలోని ఏ పోస్ట్ ఆఫీస్‌లోనైనా ఖాతాను వెంటనే ప్రారంభించవచ్చు.