📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
Entertainment

వివాదానికి తెర.. సినిమా పేరు మారుస్తామన్న ‘ఘూస్‌ఖోర్ పండత్’ మేకర్స్

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
వివాదానికి తెర.. సినిమా పేరు మారుస్తామన్న ‘ఘూస్‌ఖోర్ పండత్’ మేకర్స్
AdvertisementAdvertisement
హైదరాబాద్: మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఘూస్‌ఖోర్ పండత్’ చిత్రంపై నెలకొన్న వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో కీలక మలుపు తిరిగింది. సినిమా పేరులో ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని కించపరిచే భావం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగగా చిత్రబృందం పేరు మార్పుకు అంగీకరించింది. విచారణ సందర్భంగా దర్శకుడు నీరజ్ పాండే తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి హామీ ఇస్తూ, ప్రస్తుతం ఉన్న సినిమా పేరును వెంటనే ఉపసంహరించుకుంటామని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని, సమాజంలో ఏ వర్గాన్నీ అవమానించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కొత్త పేరుతో ప్రమాణపత్రం సమర్పిస్తామని వెల్లడించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ భావప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉన్న హక్కే అయినప్పటికీ, అది ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయకుండా ఉండాలని సూచించింది. సినిమా పేరు మార్పు పూర్తైన తర్వాతే చిత్ర పరిశీలన మండలి ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు విడుదలకు అనుమతి ఉండదని తెలిపింది. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నీరజ్ పాండేతో పాటు రితేశ్ షా సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పేరు మార్పుతో వివాదానికి పూర్తిగా తెరపడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.