నిర్మల్ సాక్షర : యామి రాకతో జిల్లా పోలీసు శాఖ సామర్థ్యం మరింత పెరుగుతుంది.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్.యామి అనే పోలీసు జాగిలం 8 నెలల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ) లో ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని నిన్న నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఉత్తీర్ణత సాధించి నిర్మల్ జిల్లాలో ట్రాకింగ్ విభాగంలో విధులు నిర్వహించేందుకు ఇది సిద్ధమై వచ్చింది. ఈ సందర్భంగా నేడు యామి తన హ్యాండ్లర్లతో కలిసి జిల్లా పోలీసు అధికారి ఎస్పీ జానకి షర్మిల ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.అధికారిని కలిసిన సందర్భంగా జాగిల శిక్షణ, సామర్థ్యం,భవిష్యత్తులో నిర్వహించనున్న విధులపై వివరాలు తెలియజేశారు. యామి అనే జాగిలం క్రాకర్ బెల్గం మలినాయిస్ బ్రీడ్ కు చెందినది. ఈ బ్రీడ్ తన చురుకుదనం,గమనించే శక్తి, వాసన గుర్తించే సామర్థ్యం, నేర అన్వేషణలో ఖచ్చితత్వం వంటి లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.నేర పరిశోధనలు, మిస్సింగ్ కేసులు, ట్రాకింగ్ ఆపరేషన్లు వంటి కీలక సందర్భాల్లో ఇది పోలీసు విభాగానికి ఎంతో తోడ్పడనుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యామి సేవలను ప్రశంసిస్తూ, ప్రజల భద్రత,నేరాల ఛేదనలో ఈ ట్రాకర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పోలీసు విభాగంలో ఆధునిక విధానాలు, శాస్త్రీయ అన్వేషణ పద్ధతుల వినియోగానికి ఇది మరొక అడుగు అని పేర్కొన్నారు. హ్యాండ్లర్స్, వారు అందుకున్న ప్రశంసా పత్రాలతో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.యామిని శిక్షణతో తీర్చిదిద్దిన హ్యాండ్లర్లు జి.పరమేశ్వర్ మరియు ఎం.సాగర్ ఈ శునకంతో కలిసి విధులు నిర్వహించనున్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement