📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
District News

నిర్మల్ ముట్టడికి ఆదివాసీ, దళిత సంఘాల పిలుపు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్ ముట్టడికి ఆదివాసీ, దళిత సంఘాల పిలుపు
  • ఫిబ్రవరి 21లోపు సర్పంచ్ అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్
  • నిర్మల్ ముట్టడికి ఆదివాసి దళిత సంఘాల పిలుపు
AdvertisementAdvertisement
నిర్మల్ సాక్షర: లక్ష్మణ్ చంద మండలంలోని బోరిగాం సర్పంచ్ కోరేపల్లి మల్లికార్జున్ (అర్జున్) రెడ్డిని ఫిబ్రవరి 21 లోపు అరెస్ట్ చేయకుంటే, అంబేద్కర్ సంఘం మరియు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నేతలు హెచ్చరించారు.ఆదివాసీ మహిళపై దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేయడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య,ఉపాధ్యక్షులు జాన్ సత్య,అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ మండిపడ్డారు. లక్ష్మణ్‌చాందకు చెందిన అర్జున్ రెడ్డిపై ఇప్పటికే లక్ష్మణ్‌చాంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నంబర్ 182/2025 కింద బీఎన్ఎస్ మరియు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వంటి కఠినమైన సెక్షన్లతో కేసు నమోదైందనీ అయినప్పటికీ,హైకోర్టులో కేసు ఉందన్న సాకుతో పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు పంపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, కేసును నీరుగారుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ​ఈ ఘటనతో పాటు,నిర్మల్ డీఎస్పీ కార్యాలయంపై దాడి చేసి నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నించిన ఘటనపై కూడా నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నంబర్ 29/2026 కింద అదనపు కేసులు నమోదయ్యాయన్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిని ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం వల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు నెలకొంటున్నాయని గోడం గణేష్ పేర్కొన్నారు.ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తక్షణమే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ​రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు బాధితులకు న్యాయం చేయడంలో వెనుకాడుతున్నారని సంఘాల నేతలు తీవ్రంగా ఆరోపించారు.ఒక ఆదివాసీ మహిళపై దాడి జరిగి నెలలు గడుస్తున్నా,నిందితుడు బాహాటంగా తిరుగుతుండటం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు వంటిదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాల్సిన బాధ్యత హోం శాఖపై ఉందని, తక్షణమే అర్జున్ రెడ్డిని రిమాండ్‌కు తరలించకపోతే నిర్మల్ జిల్లా సరిహద్దులను దిగ్బంధించి తమ నిరసన సెగను ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకపోడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ లింగన్న,తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు శాకి లక్ష్మణ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్,జిల్లా నాయకులు మంద మల్లేష్, సూరప్ సాయన్న, భీమన్న మరియు ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.