📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
District News

భారత నావికా దళంలో అగ్నివీర్ ఉద్యోగాల దరఖాస్తులకు అవకాశం

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
భారత నావికా దళంలో అగ్నివీర్ ఉద్యోగాల దరఖాస్తులకు అవకాశం
  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
AdvertisementAdvertisement
నిర్మల్ సాక్షర: దేశసేవ చేయాలనుకునే యువతకు భారత నావికా దళంలో చేరేందుకు అగ్నివీర్ నియామకాలు మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందన్నారు.కావున అర్హులైన యువత ఎటువంటి ఆన్ లైన్ దరఖాస్తుల చేసుకోకుండానే, నేరుగా ఈ రిక్యూట్మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు అని అన్నారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే వారు, అన్ని ధృవీకరణ,విద్యార్హత పత్రాల ఒరిజినల్ కాపీలతో పాటు, ఆరు సెట్ల జిరాక్స్ కాపీలు, పది పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకెళ్లాలి అని సూచించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో మహిళా అభ్యర్థులకు మార్చి 9న అలాగే 15 న పురుష అభ్యర్థులకు ఎంపిక నిర్వహిస్తారు అని వివరించారు.అర్హతలు, మరిన్ని స్పష్టమైన వివరాలకై అధికారిక వెబ్‌సైట్‌ https://agnipathpayu.cdac.in ను సందర్శించాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.