📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
State News

ఐలాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల పనులపై కలెక్టర్ సమీక్ష

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఐలాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల పనులపై కలెక్టర్ సమీక్ష
  • నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం
  • లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం
  • ధరల నియంత్రణ, నాణ్యతపై ప్రత్యేక దృష్టి
AdvertisementAdvertisement
జగిత్యాల సాక్షర: కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన అన్ని ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోందని పేర్కొన్నారు. ఇటుక, కంకర, బేస్మెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు నియంత్రణలో ఉండేలా అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ధరలు భారంగా మారకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులు వెనుకబడిన చోట వేగం పెంచాలని, కేటాయించిన లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం జరగాలని, అవసరమైన మేస్త్రీలు, కార్మికులను సమయానికి ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు సహకార సంఘాల ద్వారా రుణాలు పొందాలని తెలిపారు. దశలవారీగా బిల్లుల చెల్లింపులు ఆధార్‌కు అనుసంధానమైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని కలెక్టర్ వివరించారు. అనంతరం మార్కింగ్, బేస్మెంట్, స్లాబ్ దశలో ఉన్న ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపిడివో మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.