📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
State News

ఇక్కత్ కళాకారులకు బ్రాండింగ్ మార్కెటింగ్‌పై దృష్టి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఇక్కత్ కళాకారులకు బ్రాండింగ్  మార్కెటింగ్‌పై దృష్టి
  • జీవనోపాధి మెరుగుపరచడంలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం
  • శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు, పరికరాల పంపిణీ
AdvertisementAdvertisement
జనగాం సాక్షర: ఇక్కత్ చేనేత కళాకారుల జీవనోపాధి మెరుగుపడేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. యునైటెడ్ వే హైదరాబాద్ మరియు పెర్నోడ్ రిచార్డ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా ఎల్లంల గ్రామంలోని వివర్స్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన చేనేత మహిళా ప్రావిణ్యత శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగాంలో కూడా ఇక్కత్ ఉత్పత్తుల మార్కెటింగ్ పెరగాలని సూచించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త డిజైన్‌లు నేర్చుకుని వ్యాపార రంగంలో మహిళలు రాణించాలని ప్రోత్సహించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా చేనేత కళాకారులకు రుణాలు మంజూరు చేసి వారి వ్యాపారాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్ అంశాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మన ఊరిలోనే కళను అభివృద్ధి చేసుకుంటూ ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చని, సరైన పద్ధతులు నేర్చుకుంటే బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రీ-లూమ్, లూమ్, నేచురల్ డైయింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. వృద్ధులు, ప్రత్యేక సామర్థ్య ధారులకు మోధా పెడల్ లిఫ్టింగ్ యంత్రాలు పంపిణీ చేశారు. అలాగే చేనేత కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ చింతకిండి మల్లేశం, యునైటెడ్ వే హైదరాబాద్ సీఈఓ రేఖా శ్రీనివాసన్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం పల్లె, డిజైనర్ కొండా కవితా రెడ్డి, పెర్నోడ్ రిచార్డ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.