కల్వల మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత
- మధురమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి
- ముత్తారం గ్రామంలో కుటుంబ సభ్యులకు ఓదార్పు
- సంతాపం తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
జనగామ సాక్షర: పాలకుర్తి సాక్షి ప్రధాన ప్రతినిధి కల్వల మల్లికార్జున్ రెడ్డి తల్లి మధురమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబాన్ని పరామర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి వెళ్లిన కవిత, మధురమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మధురమ్మ మరణంపై సంతాపం వ్యక్తం చేసిన కవిత, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి దుఃఖాన్ని పంచుకుంటూ ఓదార్చారు.

