📅 Tuesday, 29 September 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS దుబాయ్‌ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
‹
›
State News

స్థానిక సంస్థల విజయం అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ సమీక్ష

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
స్థానిక సంస్థల విజయం అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ సమీక్ష
  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం
  • రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర నేతలు
  • ప్రజా హామీల అమలు, 2029 లక్ష్యాలపై దిశానిర్దేశం
AdvertisementAdvertisement
న్యూఢిల్లీ సాక్షర: తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై ఢిల్లీలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించగా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో చర్చలు సాగాయి. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సమగ్ర విశ్లేషణ జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేయడం, సంక్షేమ పథకాల ప్రభావాన్ని పెంచడం వంటి అంశాలపై నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే మాటలకంటే పనులు ముందుండాలని సూచించినట్లు వెల్లడించారు. అలాగే 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నిర్మాణాన్ని బలపరచడం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయాన్ని పెంచడం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను విస్తరించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేలా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.