జన్నారం సాక్షర : జన్నారం మండలంలోని చర్లపల్లె గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురువారం రోజున హిందూ సామ్రాట్ శ్రీ భవాని అమ్మవారి ఉపాసకులు మరాటాయోదుడు హిందూ సామ్రాజ్య స్థాపకులు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని చర్లపల్లె గ్రామంలో మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలువురు హిందూ బాందవులు మాట్లాడుతూ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ దేశంలో హిందూ సామ్రాజ్య స్థాపనకు విరోచిత పోరాటాలు చేశారని హిందువుల రక్షణకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హిందూ వ్యతిరేక రాజ్యాలపై పోరాటాలు చేశారని హిందువుల కొరకు అయన చేసిన సేవలు మరువలేనివని వారు అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్క హిందువు అయన చూపిన దారిలో నడువాలని హిందువుగా జన్మించినందుకు గర్విస్తూ హిందూ సమాజ రక్షణకు సనాతన ధర్మానికి రక్షనగోడగా నిలువాలని వారు సూచించారు. ఈ సందర్బంగా హిందూవాహిని తెలంగాణా ప్రాంత ప్రముక్ ఆదర్శ్ భారతీయన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హిందూ ఉత్సవ సమితి అద్యక్షులు చుంచు రాజ్ కిరణ్ లు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు దండవేణి శ్రీదర్ హిందూ ఉత్సవ సమితి జన్నారం మండల అద్యక్షులు అత్తే రఘు చత్రపతి శివాజీ యువసేన జన్నారం మండల అద్యక్షులు ఓడిపెల్లి రాజేష్ మహేంద్ర ధర్మజాగరణ కార్యకర్త ఎంబడి సత్యం హిందూ బాందవులు మగ్గిడి తిరుపతి గొల్లపెల్లి దేవేందర్ ఎరుకల రమేష్ గాజుల దేవేందర్ సందవేని పవన్ ప్రనయి కొండపెల్లి మహేష్ మనీష్ రిశ్వంత్ గోలి చంద్రమౌళి రాథోడ్ కృష్ణ లతోపాటు మండలంలోని పలు గ్రామాలనుండి తరలివచ్చిన హిందువులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement