మల్లాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ సాక్షర: లక్ష్మణచందా మండలం మల్లాపూర్ గ్రామంలో 10 లక్షలతో (SHG V.O) వి ఓ భవన నిర్మాణానికి మరియు 10 లక్షలతో SHG వర్క్ షెడ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నయ్య, మండల నాయకులు రమేష్, గ్రామ సర్పంచ్ స్వప్న భీమేష్,మండల బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

